Thursday, September 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఐక్య పోరాటాలే శరణ్యం

ఐక్య పోరాటాలే శరణ్యం

- Advertisement -

ఆర్టీసీ రక్షణ, కార్మిక హక్కుల పరిరక్షణే లక్ష్యం
కేంద్రం విద్యుత్‌ బస్సుల విధానాన్ని మార్చాలి : ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవంలో నాయకులు
రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్ద జెండావిష్కరణలు


నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఐక్య పోరాటాల ద్వారానే ఆర్టీసీ రక్షణ, కార్మిక హక్కుల పరిరక్షణ సాధించగలమని పలువురు నాయకులు చెప్పారు. ఆర్టీసీలు కూడా విద్యుత్‌ బస్సుల్ని సమకూర్చుకొనేలా కేంద్రప్రభుత్వం విధాన నిర్ణయాల్లో మార్పులు చేయాలని కోరారు. టీజీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అన్ని డిపోల్లోనూ సంఘం జెండాలను ఆవిష్కరించారు. హైదరాబాదులోని ముషీరాబాద్‌-1 డిపో వద్ద జరిగిన జెండావిష్కరణకు ముఖ్యఅతిథిగా ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పీ రవీందర్‌రెడ్డి హాజరయ్యారు. ముషీరాబాద్‌-2 డిపో వద్ద కార్యదర్శి లింగం జెండావిష్కరణ చేశారు. బర్కత్‌పురా, కాచిగూడ, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్‌, జీడిమెట్ల డిపోల వద్ద చంద్ర ప్రకాష్‌, వెంకటేష్‌, నరసింహ, కృష్ణ, చంద్రయ్య, గీత జెండాలు ఆవిష్కరించారు. మహబూబ్‌నగర్‌ డిపో వద్ద రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు, ఖమ్మం డిపో వద్ద ఉప ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, నల్లగొండ డిపో వద్ద నరసింహ, వరంగల్‌ వన్‌ డిపో వద్ద రాష్ట్ర కార్యదర్శి ఉపేంద్ర చారి జెండావిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీలో ‘ఐక్యత- పోరాటం’ నినాదంతో 1979 సెప్టెంబర్‌ 16న ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఆవిర్భవించిందని తెలిపారు. ఆనాటి నుంచి అనేక ఐక్య పోరాటాలకు సంఘం ప్రాతినిధ్యం వహించిందని వివరించారు. ప్రస్తుతం ఆర్టీసీలో యూనియన్లతో చర్చించకుండా యాజమాన్యం కార్మికులపై పనిభారాలు పెంచి వేధింపులకు గురిచేస్తుందని విమర్శించారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనీ, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానం రద్దు చేయాలనీ, డ్రైవర్‌, కండక్టర్లను రెగ్యులర్‌ ప్రాతిపదికన రిక్రూట్‌ చేయాలని, పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలనీ, దానికోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు. ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించాలనీ, కార్మికులకు 2021, 2025 వేతన సవరణలు వెంటనే చేయాలని డిమాండ్‌ చేశారు. సంస్థలో పనిభారాలు, వేధింపులు తగ్గాలంటే కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపు ఇచ్చారు. ఇటీవల భద్రాచలం డిపో కార్మికులు టీమ్‌ డ్యూటీలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడి విజయం సాధించారని గుర్తుచేస్తూ, వారి పోరాటానికి సంఘీభావం తెలుపుతూ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -