Thursday, September 18, 2025
E-PAPER
Homeజాతీయంఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్‌బరస్ట్‌.. 10 మంది గల్లంతు

ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్‌బరస్ట్‌.. 10 మంది గల్లంతు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఉత్తరాఖండ్‌ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కుంభవృష్టి కురుస్తోన్న విషయం తెలిసిందే. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన వర్షాలు, వరదలకు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పుడు తాజాగా అక్కడ మరోసారి వర్షం బీభత్సం సృష్టించింది.

చమోలి జిల్లాలోని నందా నగర్‌లో బుధవారం రాత్రి మేఘవిస్ఫోటనం కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరదలకు 10 మంది గల్లంతయ్యారు. గల్లంతైన 10 మందిలో కుంత్రి లగా ఫాలి గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు, సర్పానికి చెందిన వారు ఇద్దరు, దుర్మా ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇక ఈ వరదలకు ఆరు భవనాలు కొట్టుకుపోయాయి. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్‌ శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను రక్షించింది. ఆ ప్రాంతంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతోంది. కాగా, రెండు రోజుల క్రితం రాజధాని డెహ్రాడూన్‌లో క్లౌడ్‌బరస్ట్‌ కారణంగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ వరదలకు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గల్లంతయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -