Friday, May 9, 2025
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి..

ప్రభుత్వ భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గురువారం రోజున కలెక్టర్ కార్యాలయంలో ఏవో జగన్మోహన్ కు  వినతి పత్రం అందజేశారు. యాదగిరి గుట్ట మండలం లోని మర్రిగూడెం గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మయ్య, బోదాసు స్వామి సిపిఐ గ్రామ శాఖ 521 సర్వే నెంబర్ 4 ఎకరాల.25 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నది అందులో కొంత మంది వ్యక్తులు కబ్జా చేసినారని, అట్టి విషయమై గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ నామ మాత్రం గానే చూసి చూడనట్లు వదిలి వేశారని అన్నారు. కబ్జా చేసిన వారిపై చర్యలు ఇంతవరకు తీసుకోలేదని, పలు పత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ స్పందన లేదని, ఇప్పటికైనా కబ్జా కు గురైన ప్రభుత్వ భూమిని పరిరక్షించి సర్వే చేసి హద్దులు నియమించి  కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -