నవతెలంగాణ – కంఠేశ్వర్
మద్యానికి బానిసైనా యువకుడుని భార్య మందలించినందుకు ట్రైన్ కు అడ్డుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై సాయి రడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంబాద్ లోని అర్సపల్లి ప్రాంతంలో గల భగత్ సింగ్ కాలనీకి చెందిన ఎనగందుల మహేష్ (33) అనే వ్యక్తి గత కొంత కాలం నుండి అతిగా మద్యానికి బానిసయ్యాడు. భార్య త్రాగుడు మానుకోమని మందలించినందకుకు మృతుడు మనస్తాపంతో సెప్టెంబర్ 17న రాత్రి ఎనిమిది గంటల సమయంలో కే యం నంబర్ 457/3-2 నిజామాబాద్ – జానకంపేట్ రైల్వే స్టేషన్లు వద్ద, రైలు నెం.11414 ప్యాసింజర్ యొక్క రాకను గమనించి దానికి అడ్డుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, హెడ్ కానిస్టేబుల్ హనుమాన్లు దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES