నవతెలంగాణ – కామారెడ్డి
దేశవ్యాప్తంగా స్వస్త్ నారి స్వశాక్ట్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 13 వార్డు టెక్రియల్ గ్రామంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. దేశవ్యాప్తంగా స్వస్త్ నారి స్వశాక్ట్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది. మహిళల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపరచడం ద్వారా కుటుంబాలను బలోపేతం ఎంతో మేలు అని డాక్టర్ రవళి అన్నారు.
మహిళా ఆరోగ్యం పై అవగాహన కల్పించడం, పోషకాహార అవసరాలువ్యాధుల నివారణ గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె మహిళలకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం పై దృష్టి ఒత్తిడి నిర్వహణ, ఆత్మవిశ్వాసం పెంపొందించటం కుటుంబ సహకారం పొందే మార్గాలు కుటుంబానికి మహిళల పాత్రను గుర్తించడం జరుగుతుందన్నారు.
ఆరోగ్య శిబిరాలు, బోధన కార్యక్రమాలు, ఆరోగ్యంపై, పోషణపై మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు, రక్తపరీక్షలు, బీపీ, షుగర్ లాంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందన్నారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన మాతృశక్తి యోజన, ఆంగన్‌వాడీ సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సుజాత, ఆశ వర్కర్స్, చెవిటి భవ్య, ముధం శైలజ, తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.