చికిత్సతో నయం చేయవచ్చు
సెప్టెంబర్ మాసంను బ్లడ్ క్యాన్సర్ మాసంగా జరుపుకుంటారు
హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ గణేష్ జైశెత్వార్
నవతెలంగాణ – కంఠేశ్వర్
రక్త క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి కాదని అత్యాధునిక వైద్య విధానం ద్వారా నయం చేయవచ్చని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ గణేష్ జైశెత్వార్ అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ మాసం రక్త క్యాన్సర్ దినోత్సవం గా జరుపబడుతుందని, రక్త క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి కాదని ఇట్టి వ్యాధిని అత్యాధునిక చికిత్స ద్వారా నయం చేయవచ్చని తెలిపారు.
ఇట్టి క్యాన్సర్ అత్యంత ఖరీదైన వైద్యం అభివృద్ధి చెందిన దేశాలలో 10 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని, ఇక్కడ మాత్రం 20 లక్షల లో ఇట్టి వైద్యం పూర్తవుతుందని తెలిపారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రతాప్ అనే బాలుడు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ చికిత్స నిమిత్తం హైదరాబాదులోని యశోద ఆసుపత్రిని సంప్రదించగా 2014 నుండి 2017 వరకు చికిత్స అందజేయడంతో బాలుడు అత్యంత మెరుగై క్రీడలలో చదువులో రాణిస్తున్నాడని, 13 సంవత్సరాల సోమేశ్వర్ ఇదే వ్యాధితో బాధపడుతుంటే అతనికి కూడా చికిత్స అందజేయడం జరిగిందని తెలిపారు. దీనితో బాలుడు చలాకీగా ఉన్నాడని, వర్ని మండలానికి చెందిన రామారావు 8 సంవత్సరాల నుండి రక్త క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకొని సమాజంలో చలాకీగా పని చేసుకుంటున్నారని వివరించారు.
రక్త క్యాన్సర్లు ఒకప్పుడు భయం అనిశ్చితి ని కలిగించాయని కానీ 2025లో ఖచ్చితమైన వైద్యం రోగనిరోధక చికిత్సలు లక్ష్యంగా చేసుకున్న మందులు అధునాత ఎముక మజ్జ బోన్ మారో మార్పిడి కారణంగా అనేక రకాల రక్త క్యాన్సర్లు రక్త రుగ్మతలలో 90% మించిపోయాయని నేడు రోగులు బతికేవారు కాదని, వారు పూర్తిగా సాధారణ ఆరోగ్యకరమైన జీవితాలను ఇట్టి చికిత్స ద్వారా గడుపుతున్నారని అన్నారు.
భారతదేశంలో ప్రతి 20 సెకండ్లకు ఎవరైనా ఒకరు రక్త క్యాన్సర్ కారణంగా తమ ప్రాణాలను కోల్పోతున్నారని అయినప్పటికీ మన దేశంలో అందుబాటులో ఉన్న ఆధునిక సంరక్షణతో నేడు చాలామంది రోగులలో రక్త క్యాన్సర్ నయమవుతుందని అన్నారు. ఆరోగ్యం డబ్బు లాంటిదని మనం దానిని కోల్పోయే వరకు దాని విలువ గురించి మనకు నిజమైన ఆలోచన ఉండదని ఆయన ప్రత్యేకంగా గుర్తు చేశారు. క్యాన్సర్ అంటేనే భయపడే రోజులు పోయాయని ప్రతి క్యాన్సర్ కి చికిత్సలు తప్పకుండా చేయబడతాయని చికిత్సలతో నయమవుతాయని తెలిపారు.