Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్108 అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ..

108 అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ..

- Advertisement -

నవతెలంగాణ – గండీడ్ 
జీవీకే ఈఎంఆర్ఐ గండీడ్ మండల కేంద్రంలోని 108 అంబులెన్స్ ను ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ రవి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్ లోని వివిధ రకాల పరికరాలు,వాటి పనితీరు మందులు, రికార్డులను పరిశీలించారు. ఏవైనా పరికరాలు పని చేయకపోతే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి అంబులెన్స్ లో ఉండేటట్లు సరిచూసుకోవాలని, కేసు వచ్చిన తక్షణమే 108 అంబులెన్స్ సంబంధిత ప్రదేశానికి చేరుకొని క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలన్నారు. అంబులెన్స్ సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండాలని నాణ్యమైన వైద్యాన్ని అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ జానమ్మ పైలట్ అక్బర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -