నవతెలంగాణ-కంఠేశ్వర్
ప్రభుత్వ పెన్షనర్ల, ఉద్యోగుల, ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపర్డెంట్ ఆధ్వర్యంలోని జిల్లా మెడికల్ బోర్డు వద్ద అనేకం పెండింగ్లో ఉన్నాయని ,వాటిని తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్ ను కలిసి విజ్ఞప్తి చేసింది. మెడికల్ బోర్డు సమావేశాలు సక్రంగా జరగటం లేదని ,దీని మూలంగా పెన్షనర్లు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని అధ్యక్షులుకే. రామ్మోహన్రావు అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ ని కలిసిన వారిలో జిల్లా నాయకులు ఈవిఎల్ నారాయణ,శిర్ప హనుమాన్లు, పురుషోత్తం, సత్యనారాయణ, మధుసూదన్ తదితరులు ఉన్నారు.
పెండింగ్ మెడికల్ బిల్లులను పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES