నవతెలంగాణ – అశ్వారావుపేట
పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వాలు తన పరిధిలోని భూభాగాన్ని రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు,రెవిన్యూ విలేజెస్ విభజిస్తారు.వీటి కి ఆయా స్థాయి లను బట్టి అధికారులను నియమిస్తారు. అయితే ప్రభుత్వాలు మారిన ప్రతీసారి వీటిని కుదించడం మో లేక విస్తరించడం మో లేక పేర్లు మార్చడం మో నూతన పాలకులు మార్పులు చేర్పులు చేస్తుంటారు.
1990 వరకు సమితి లు ఉన్న పరిపాలనా భూభాగాలను ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు) ముఖ్యమంత్రి అయ్యాక మండలాలు గా నామకరణం చేసారు.ఇందులో అంతర్భాగం అయిన రెవిన్యూ గ్రామాలకు ఒక్కో వీఆర్ఓ ను నియమించారు.
2014 లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయి కేసీఆర్ (కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు) ముఖ్యమంత్రి గా పాలన చేపట్టాక వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి పేరుతో రెవిన్యూ గ్రామాలు గా ఉన్న వ్యవస్థను క్లస్టర్ గా నామకరణం చేసారు. వీటికి ఒక్కో అధికారి ని సైతం జీపీఓ (గ్రామ పరిపాలనా అధికారి)గా నియమించారు.
ప్రస్తుతం వారు విధుల్లో చేరుతున్నారు. 19 రెవిన్యూ గ్రామాలుగా ఉన్న మండలాన్ని ప్రస్తుతం 14 క్లస్టర్ లు విభజించారు.ఇక నుండి వీటిని క్లస్టర్ గ్రామాలుగా నిలవాల్సిన అవసరం ఉంది.
క్లస్టర్ రెవిన్యూ విలేజ్
1)అశ్వారావుపేట అశ్వారావుపేట
2)నారావారి గూడెం నారంవారిగూడెం
3)అచ్యుతాపురం అచ్యుతాపురం
4)ఆసుపాక ఆసుపాక + వేదాంతపురం
5)తిరుమలకుంట తిరుమలకుంట
6)నందిపాడు నందిపాడు + దురదపాడు
7)గుమ్మడివల్లి గుమ్మడవల్లి
8)గుంటిమడుగు గుంటిమడుగు + ఖమ్మం పాడు
9)బచ్చువారిగూడెం బచ్చువారిగూడెం
10)నారాయణపురం నారాయణపురం
11)అవుతారు అనంతారం + రామన్నగూడెం
12)జమ్మిగూడెం జమ్మిగూడెం + మద్ది కొండ
13)కన్నాయిగూడెం కన్నాయిగూడెం
14)కావడిగుండ్ల కావడిగుండ్ల