Thursday, September 18, 2025
E-PAPER
Homeఖమ్మంపోడు భూములకు విద్యుత్ సదుపాయం..

పోడు భూములకు విద్యుత్ సదుపాయం..

- Advertisement -

– ఆనందంలో గిరిజన రైతులు
– రూ 60 లక్షల వ్యయంతో విద్యుత్ సరఫరా – ఏడీఈ వెంకటరత్నం
నవతెలంగాణ – అశ్వారావుపేట

వ్యవసాయానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని నాడు రోజులు తరబడి తిరిగే స్థితి నుండి దరఖాస్తు చేసుకున్న కొద్దిరోజుల్లోనే విద్యుత్ సరఫరా అందించే పరిస్థితి కి ప్రభుత్వ విధానాలు సరళతరం అయ్యాయి.  దీంతో రైతులు ఆనందడోలికల్లో తిరుగుతున్నారు.  వినాయకపురం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో పోడు భూములకు గురువారం విద్యుత్ సరఫరా ప్రారంభించినట్లు ఎన్పీడీసీఎల్ ఆపరేషన్స్ ఏడీఈ బి. వెంకటరత్నం తెలిపారు. 

39 మంది రైతులు తమ పోడు భూముల వ్యవసాయానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారని ఆ మేరకు పరిశీలించి పలు స్కీం లు ద్వారా  రూ. 60 లక్షల వ్యయంతో నాలుగు కిలోమీటర్ లు లైన్, 100 కేవీ ఏ ట్రాన్స్ఫార్మర్ లు 3,63 కేవీ ఏ ట్రాన్స్ఫార్మర్ లు 2 ఏర్పాటు చేసి 39 మోటార్ లకు విద్యుత్ సౌకర్యం కల్పించామని అన్నారు.దీంతో నాలుగు వందల ఎకరాలు సాగు అవుతుందని అంటున్నారు.గురువారం విద్యుత్ సరఫరా కావడంతో గిరిజన రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ సంతోష్, కాంట్రాక్టర్,రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -