Thursday, September 18, 2025
E-PAPER
Homeక్రైమ్గుర్తుతెలియని యువతి శవం లభ్యం 

గుర్తుతెలియని యువతి శవం లభ్యం 

- Advertisement -

నవతెలంగాణ-నిజాంసాగర్
నిజాంసాగర్ మండలంలోని జక్కాపూర్ గ్రామ శివారు నుండి నర్సింగ్ రావు పల్లి వెళ్లే దారిలో గల అటవీ ప్రాంత ట్రెంచ్ లో ఒక గుర్తు తెలియని కుళ్ళిపోయిన యువతి శవం లభ్యమైనట్టు నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపారు. ఈ మృతదేహం వయసు 14 నుండి 18 సంవత్సరాల మధ్యలో ఉంటుందని, చనిపోయి అందాజ 10 రోజుల వరకు అవుతుందని ఆయన అన్నారు. మెరూన్ రంగు లెగ్గిన్, ఆకుపచ్చ రంగు టాప్, బూడిద రంగు శాలువా కలదు అని అయినా అన్నారు. యువతి శవాన్ని ఎవరైనా గుర్తు పట్టినట్టు అయితే నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ 8712686172, 8712666221 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -