Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్వచ్ఛతా హీ సేవలో భాగస్వాములు కావాలి: ఎంపీడీఓ

స్వచ్ఛతా హీ సేవలో భాగస్వాములు కావాలి: ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగనున్న “స్వచ్ఛతా హీ సేవ” కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎంపీడీవో వేణుమాధవ్ పిలుపునిచ్చారు. గురువారం మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక పరిశుభ్రత పనులు ప్రారంభమయ్యాయి. చెత్త తొలగింపు, డ్రెయినేజీ శుభ్రత, వీధుల పరిశుభ్రత వంటి పనులను అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజలతో కలిసి క్లీన్ చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో స్వచ్ఛోత్సవ్, పక్షోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానిక ఉన్నత పాఠశాలలో ఎంఈవో బుధారపు శ్రీనివాస్ తో కలిసి ఎంపీడీవో మాట్లాడారు.. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. అక్టోబర్ 2 వరకు జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం అన్నారు. పరిశుభ్రమైన గ్రామాలు నిర్మించుకోవడమే స్వేచ్ఛతాహి సేవ లక్ష్యం” అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -