– వంగ రామయ్యపల్లి మాజీ సర్పంచ్ వంగ విజయలక్ష్మి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
విద్యార్థులు కష్టపడి చదువుకుంటేనే ఉన్నత స్థానం సాధిస్తారని వంగ రామయ్యపల్లి మాజీ సర్పంచ్ వంగ విజయలక్ష్మి అన్నారు. గురువారం హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ ఆర్థిక సహాయంతో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారు గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించారని తెలిపారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుతెరిగి విద్యార్థులు ఇష్టపడి చదవాలన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా రోటరీ క్లబ్ నుండి 8, 9 ,10వ తరగతి విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు వంగ వెంకటరెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES