Thursday, September 18, 2025
E-PAPER
Homeఆదిలాబాద్రేపు కలెక్టరేట్ ఎదుట నిరాహారదీక్ష

రేపు కలెక్టరేట్ ఎదుట నిరాహారదీక్ష

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్.పీఆర్.డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 20న కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలేనిరాహార దీక్షలను నిర్వహిస్తున్నట్లు ఎన్.పీఆర్.డీ జిల్లా అధ్యకుడు మెస్రం నగేష్ పేర్కొన్నారు. దీక్షలో వికలాంగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గురువారం సుందరయ్య భవనంలో సమావేశంఏర్పాటు చేసి మాట్లాడారు. 2023 డిసెంబర్ నాటికీ జనవరి లోపల వికలాంగులకు రూ.6 వేలను పింఛన్ పెంచుతామని చెప్పిన ప్రభుత్వం.. అధికారంలో వచ్చి 22 నెలలు గడుస్తున్నా పింఛన్ ఇదివరకు పెంచలేదన్న్నారు.

ఈ నెల చివరి వరకు కొత్త పింఛన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  5% వికలాంగుల ఇందిరమ ఇల్లులు మంజూరు చేయాలని అన్నారు. 100% రాయితీ సబ్సిడీ లోన్ ప్రతి మండల కేంద్రంలో 20 యూనిట్ గా పెంచాలన్నారు.వికలాంగుల సపరేట్ శాఖ ఇవ్వాలని చదువుకున్న వికలాంగులకు బ్యాకలాగ్ పోస్ట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి అరిఫాబేగం, ఉపాధ్యక్షుడు కే ఆశన్న, సహాయ కార్యదర్శి చుక్కబోట్ల పోచన్న, కోశాధికారి కుమ్ర శత్రుఘన్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -