Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మిలిటరీ లిక్కర్ నిల్వ ఉంచుకోవడం, అమ్మడం నేరం 

మిలిటరీ లిక్కర్ నిల్వ ఉంచుకోవడం, అమ్మడం నేరం 

- Advertisement -

– కామారెడ్డి ఎక్సైజ్ శాఖ సిఐ
నవతెలంగాణ –  కామారెడ్డి

నాన్ డ్యూటీ పెయిడ్లి లిక్కర్ అయిన రక్షణ శాఖకు, మిలిటరీ కి సంబంధించిన లిక్కర్ను కలిగి ఉంటే అలాంటి వారిపై కేసులు చేయడం జరుగుతుందని కామారెడ్డి ఎక్సైజ్ సీఐ కృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల డిప్యూటి కమిషనర్ వి. సోమిరెడ్డి , కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి బి. హన్మతరావు  ఆదేశాల మేరకు, నమ్మదగిన సమాచారం తో  కామారెడ్డి తన సిబ్బందితో కలిసి పాల్వంచ మండలం ఆరేపల్లి గ్రామములోని ఒక ఇంటిలో సోదాలు జరపగా ఒక కార్యక్రమం కొరకు తెచ్చిన Defence Liquor లబించినదనీ, ఆ ఇంటి వద్ద మొత్తం (55) సీసాల Military Liquor సుమారు (41.25) లీటరు లు లభ్యమైనదనీ నిందితుడు హన్మండ్లు పై కేసు నమోదు చెయ్యడం జరిగిందన్నారు. ఇలాంటి నాన్ డ్యూటీ వేడి లిక్కర్, రక్షణ శాఖ, మిలిటరీ కలిగి ఉంటే కేసులు  చేయడం జరుగుతుందన్నారు. ఈ సోదాలో ఎక్సైజ్ ఎస్ ఐ యం. విక్రం కుమార్, ఎక్సైజ్ ఎస్సై, బి. శ్రీనివాస్ రావు, సిబ్బంది ఎస్.కె, పాషా. ఏం. మైసరాజు, కె. దేవా కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -