పిడిఎఫ్ యూ డిమాండ్
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాన్ని నిర్మించాలని కళాశాల కమిటీ పిడిఎఫ్ యూ నాయకురాలు డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిడిఎస్ యూ అధ్యక్షురాలు వైష్ణవి మాట్లాడుతూ డిచ్ పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం జరుగుతుందనీ వివరించారు.
ప్రస్తుతం ఉన్న డిగ్రీ కళాశాలలో కనీస వసతులు లేకుండా విద్యార్థులకు, విద్యార్థినీలకు టాయిలెట్ సౌకర్యాలు లేకుండా కొనసాగడం సిగ్గుచేటన్నారు. కోళ్ల ఫారం లాంటి తరగతులల్లో, చెట్లు, పురుగులు పాములు తిరిగే తరగతి గదులు ఉండడం బాధాకరమన్నారు. తుప్పు పట్టిన గోడలు, ఎప్పుడు కూలిపోతుందని భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండే పరిస్థితి నెలకొందన్నారు.
త్రాగడానికి నీరు లేకుండా, కనీస వసతులు లేకుండా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొనసాగడం దుర్మార్గమన్నారు. వెంటనే రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి , జిల్లా కలెక్టర్ , మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డిగ్రీ కళాశాల కమిటీ నాయకులు దీపిక, సుష్మ,మానస, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీ కళాశాలకు సొంత భవనాన్ని నిర్మించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES