Thursday, September 18, 2025
E-PAPER
Homeజిల్లాలుసీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల అనుమతులు నిధుల మంజూరు కోసం గురువారం మధ్యాహ్నం హైదరాబాదులోని సీఎం కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అచ్చంపేటలో పెండింగ్ పనులకు నిధుల మంజూరు చేయుట కొరకు వినతి పత్రం అందజేశారు.

ఇందిరమ్మ ఇండ్లును అదనంగా 1000 ఇండ్లు కేటాయించాలని కోరారు. ఉల్పర్ నుంచి కల్వకుర్తి వరకు బీటీ రోడ్డు మంజూరు చేయాలని, అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన బిల్డింగ్ నిర్మాణం కొరకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్ళినట్లు సమాచారం. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే వెల్లడించారు. సంబంధిత శాఖ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. వెంటనే అచ్చంపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతులు, నిధులు మంజూరు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -