Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సంగెం భీమలింగం కత్వా వద్ద వ్యక్తి మృతదేహం లభ్యం

సంగెం భీమలింగం కత్వా వద్ద వ్యక్తి మృతదేహం లభ్యం

- Advertisement -

నవతెలంగాణ – వలిగొండ రూరల్
మూసి నది ఎగువన కురుస్తున్న అతి భారీ వర్షాలకు మూసీ నదికి పోటెత్తిన వరదలో వ్యక్తి మృతదేహాన్ని సంగెం గ్రామ పరిధిలోని భీమలింగం కత్వా వద్ద మూసీ లోలెవల్ వంతెనపై గురువారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఘటన స్థలంలో విచారణ చేసి సంగెం వద్ద మూసీ నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చినట్లు మూసీ పరివాహక ప్రాంత పోలీస్ స్టేషన్లకు సమాచారం చేరవేశారు. సమాచారం తెలుసుకున్న హైదారాబాద్ హబీబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇటీవల కురిసిన వర్షానికి వచ్చిన భారీ వరదలలో గల్లంతైన వ్యక్తి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న వ్యక్తి గల్లంతైన కుటుంబ సభ్యులు మృతదేహం లభ్యమైన చోటు చేరుకొని మృతుడు కంబలే అర్జున్ (28)గా గుర్తించారు. మృతుని కటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాట్లు ఎస్సై యుగంధర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -