Friday, September 19, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంయాంటీఫాపై ట్రంప్‌ కుయుక్తులు

యాంటీఫాపై ట్రంప్‌ కుయుక్తులు

- Advertisement -

ఉగ్రవాద సంస్థగా ముద్ర
నిధులిస్తే చర్యలు తప్పవంటూ బెదిరింపులు

వాషింగ్టన్‌ : అమెరికాలో మితవాదానికి, ఫాసిజం ధోరణలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న యాంటీఫా గ్రూపును దెబ్బతీసేందుకు ఆ దేశ అధ్యక్షుడు డఓనాల్డ్‌ ట్రంప్‌ కుయుక్తులకు తెర లేపారు. అది ఒక ఉగ్రవాద సంస్థ అని, ఎవ్వరైనా నిధులు సమకూర్చితే దర్యాప్తును ఎదుర్కొవాల్సివుంటుందని బెదిరింపులకు దిగారు. చార్లీ కిర్క్‌ కాల్పుల ఘటనను ఇందుకు అతను సాకుగా పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తికి యాంటీఫాతో సంబంధముందని ఎఫ్‌బిఐ పేర్కొంది. అయితే అందుకు సాక్ష్యాధారాలేవీ చూపలేదు. దీనినే సాకుగా చేసుకున్న ట్రంప్‌ యాంటిఫాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించేశారు. ఈ మేరకు తన సొంత సోషల్‌ మీడియా సంస్థ అయిన ‘ట్రూత్‌’లో పోస్టు చేశారు. ‘యాంటీఫా అనేది ఒక అనారోగ్య, ప్రమాదకరమైన, అతివాద వామపక్ష సమస్య. అంతకుమించి అదో ఉగ్రవాద సంస్థ. నిధులిచ్చేవారిపై కఠిన చట్టాల కింద దర్యాప్తు చేపడుతాం’ అని ట్రంప్‌ బెదిరించారు.

వాస్తవానికి యాంటీఫా అనేది సంస్థగా ఏమీ లేదు. ‘ఫాసిజానికి వ్యతిరేకం’ అని అర్థం వచ్చేలా స్థానిక యువత, కొంత మంది స్వచ్చంద సంస్థల ప్రతినిధులు ఏర్పాటు చేసుకున్న ఒక గ్రూపు మాత్రమే. మితవాద విధానాలను, ఫాసిస్ట్‌ చర్యలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపడుతుంటుంది. కేంద్రీకృత నిర్మాణం, ప్రధాన కార్యాలయం, సభ్యత్వాలు వంటి సంస్థాగత నిర్మాణమేదీ ఈ గ్రూపునకు లేదు. అమెరికా పాలకులు అనుసరిస్తున్న మితవాద, ఫాసిస్టు తరహా విధానాలను అడ్డుకునేందుకు 2016 నుంచి ఈ గ్రూపు అజ్ఞాతంగా కార్యాకలాపాలు సాగిస్తోందని..ప్రముఖ సాహితీకారుడు ‘ది యాంటి ఫాసిస్ట్‌’ పుస్తక రచయిత మార్క్‌ బ్రే తెలిపారు. వామపక్ష, అభ్యుదయ శక్తులను అణిచివేయాలనే కుట్రపూరితంగానే యాంటిఫాపై ఉగ్రవాద ముద్ర వేస్తున్నారని, గతంలో ఎటువంటి తీవ్రవాద కార్యకలాపాల చరిత్ర ఆ గ్రూపునకు లేదని పలువురు విమర్శిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -