Friday, September 19, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీ పర్యటనలో బిజీగా సీఎం రేవంత్..

ఢిల్లీ పర్యటనలో బిజీగా సీఎం రేవంత్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న 12వ వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరై.. “విజన్ తెలంగాణ – తెలంగాణ రైజింగ్” అంశంపై ప్రసంగించనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా వివిధ దేశాల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, పెట్టుబడిదారులకు తెలియజేయనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు తాజ్ ప్యాలెస్ హోటల్‌లో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి. మర్ఫీతో భేటీ భేటీ కానున్నారు. 11.30కి బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మోడరేట్ చేసే వార్షిక ఫోరమ్‌లో విజన్ తెలంగాణ రైజింగ్ తెలంగాణ అంశంపై ప్రసంగిస్తారు.

మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, కార్ల్స్‌బర్గ్, కార్లైల్, గోద్రెజ్, ఉబెర్ కంపెనీల ప్రతినిధులతో తెలంగాణ సీఎం విడివిడిగా సమావేశమవుతారు. తెలంగాణలోపెట్టుబడులు పెట్టే అవకాశాలపై వాళ్లతో చర్చలు జరుపుతారు. మధ్యాహ్నం 12.30కు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు, సీఈఓ, నార్వే మాజీ యూనియన్ మంత్రి బోర్జ్ బ్రెండేతో సీఎం ప్రత్యేక సమావేశం అవుతారు. ఈ భేటీలో తెలంగాణలో పెట్టుబడులు, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వం వల్ల పొందుతున్న లబ్ధి వంటి అంశాలపై చర్చిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -