Friday, September 19, 2025
E-PAPER
Homeజాతీయంత్వరలో ' ఈ-ఆధార్‌ యాప్‌'

త్వరలో ‘ ఈ-ఆధార్‌ యాప్‌’

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆధార్ యూజర్లు, హోల్డర్ల కోసం భారత ప్రభుత్వం ఒక మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఆధార్‌కు సంబంధించి ప్రాథమిక అవసరాలకు ఆధార్ సెంటర్లకు వెళ్లే పనిలేకుండా ‘ ఈ-ఆధార్‌ యాప్‌’ మొబైల్ యాప్‌ను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అభివృద్ధి(యూఐడీఏఐ) అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ యాప్‌ను ఉపయోగించి వ్యక్తిగత వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే, దీన్ని ఈ ఏడాది నవంబర్‌లో ప్రారంభించాలని భావిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో వ్యక్తిగత వివరాలలో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మరిన్ని వివరాలను అప్‌డేట్ చేసుకునే వీలుంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -