Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మైబాపూర్ జిపి పంచాయతి సెక్రటరీపై దాడి చేసిన గ్రామస్తుడు...

మైబాపూర్ జిపి పంచాయతి సెక్రటరీపై దాడి చేసిన గ్రామస్తుడు…

- Advertisement -

– పన్నులు అడిగినందుకు దూరుసుగా ప్రవర్తించి , జిపి కార్యాలయం కు వచ్చి దాడి చేసిన గ్రామస్తుడు
– జుక్కల్ పిఎస్ లో  ఫిర్యాదు చేసి కార్యదర్శి
– కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్న జుక్కల్ ఎస్సై
నవతెలంగాణ – జుక్కల్ 
: మండలంలోని మైబాపూర్ గ్రామ పంచాయతీ  కార్యదర్శి విజయ్ కుమార్ పైన అదే గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి అనే వ్యక్తి దాడి చేసిన ఘటన గురువారం నాడు  చోటు చేసుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు మరియు మైబాపూర్ జిపి కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం జిపి కార్యదర్శి వీధుల్లో భాగంగా గ్రామంలో ని ఇంటింటికి తిరుగుతూ ఇంటి పన్నులు మరియు ఇతర పెండింగ్ లో ఉన్న పన్నులు కట్టాలని గ్రామస్తుడు అశోక్ రెడ్డిని పెండింగ్ లో ఉన్న ఇంటి పన్నులు కట్టాలని కోరగా పన్నులు వసూలు చేసి ఏం చేస్తారని ప్రశ్నించాడు.

వసూలు చేసిన పన్నులను ప్రభుత్వ ఖాతాలో జమ చేసి తిరిగి గ్రామ అభివద్ధి పనులకు మాత్రమే ఉపయోగంలోకి వస్తాయని కార్యదర్శి తెలిపాడు. మా డబ్బులు మాకు ఖర్చు పెట్టడమేంటి? మీ జిపి కి సంబంధించిన నిధుల డబ్బులు ఖర్చులు పెట్టాలని అన్నాడు, నిధులు లేకపోతే  మీ సొంత డబ్బులు పెట్టి గ్రామ అభివృద్ధికి ఖర్చు చేయూలని అన్నాడు. అలాగైతేనే పన్నుల డబ్బులు ఇస్తామని,  లేకపోతే మా డబ్బులతో మేమే ఖర్చు చేసుమని గ్రామాన్ని అభివృద్ధి పరచుకుంటామని అశోక్ రెడ్డి అన్నాడు. కార్యదర్శి మాట్లాడుతూ.. ఇప్పటికే గ్రామ పంచాయతీకి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టామని, మా దగ్గర డబ్బులు లేవని అందుకే పన్నులు వసూలు చేసి గ్రామంలో అభివృద్ధి పనులకు ఉపయోగంలోకి వస్తాయని ఉద్దేశంతో ఉద్యోగరీత్యా కర్నూలు వసూలు చేయాలని వచ్చిన పనులను గ్రామ అభివృద్ధికి ఖర్చు చేస్తామని తెలిపారు. గ్రామాభివృద్ధికి సహకరించాలని సెక్రెటరీ కోరాడు.

అలాగైతే మీ అవసరమేంటి మాకు మీరు ఉన్నది ఎందుకు?  ఇష్టముంటే ఉద్యోగం చేయండి,  లేకపోతే లాంగ్ లీవ్ పెట్టి వెళ్లిపోవాలని ఉచిత సలహ గ్రామస్తుడు అశోక్ రెడ్డి ఇచ్చాడు . ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోంది.  అంతలోనే గ్రామస్తులు సార్ మీరు వెళ్లి గ్రామపంచాయతీలో కూర్చోండి ఎందుకులే ఈ గొడవ ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు వచ్చి కడతారు,  అని తెలుపగా కార్యదర్శి జిపి కార్యాలయానికి వెళ్లిపోయాడు. గ్రామస్తుడు అశోక్ రెడ్డి జిపి కార్యాలయానికి వెళ్లి పన్నుల వసూలు విషయంపై కార్యదర్శితో దురుసుగా మాట్లాడుతూ ప్రవర్తించాడు. కోపాద్రక్తుడైన అశోక్ రెడ్డి గ్రామ కార్యదర్శి పై దాడి చేశాడు అనరాని మాటలు అని సంభోదించాడు అని సెక్రెటరీ తెలిపాడు. జిపి కార్యదర్శి తో పాటు కారో భారీ గోవింద్ జి పి కార్యాలయంలోనే ఉన్నాడు.

అశోక్ రెడ్డిని కారు భారీ ఎంత నచ్చచెప్పిన వినలేదు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సార్ మీరు వెళ్లిపోండి అని కార్యదర్శికి  కారో భారీ గోవింద్ చెప్పడంతో విజయ్ కుమార్ ద్విచక్ర వాహనంపై వెళ్లేందుకు సిద్ధం అయ్యాడు.  సెక్రెటరీ విజయ్ ద్విచక్ర వాహనంపై అశోక్ రెడ్డి కూర్చుని ఉన్నాడు. కార్యదర్శి వచ్చి అశోక్ రెడ్డిని తన వాహనం పై నుండి లేవమని కోరినందుకు మళ్లీ ఇంకోసారి ఒకరిపై ఒకరు దాడి చేసు ఉన్నారు. గ్రామస్తులు గుమిగుడి ఇద్దరినీ వేరుచేసి జిపి సెక్రటరీని వెళ్లిపోవాలని గ్రామస్తులు సూచించారు. జిపి కార్యదర్శి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో అశోక్ రెడ్డి రాళ్లతో దాడి చేశాడు . రాళ్లు  వీపుపై జిపి కార్యదర్శికి తగిలిన వెళ్లిపోయాడు. జరిగిన ఘటన విషయాన్ని ఎంపీడీవో శ్రీనివాస్ , ఎంపీ ఓ రాము కు కార్యదర్శి విజయ్  తెలియజేశారు.

అదేవిధంగా జిల్లా జిపి కార్యర్శుల సంఘ నాయకులకు తెలియజేశారు. అశోక్ రెడ్డిని ఎంపీడీవో కార్యాలయానికి పిలిపించుకుని సంజాయిసి కోరగా నాపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటే నేను కోర్టులో హాజరై నా వాదన వినిపిస్తానని దాడి చేసిన వ్యక్తి అశోక్ రెడ్డి ఎంపీడీవో కు అనడంతో సమస్య పరిష్కారం కాలేకపోయింది. అనంతరం జుక్కల్ పీఎస్ లో రాతపూర్వకంగా అశోక్ రెడ్డి పై మైబాపూర్ జిపి కార్యదర్శి విజయ్ కుమార్ ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే పలు సెక్షన్ల ఉపయోగించి జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నామని జుక్కల్ ఎస్సై తెలిపారు. ఇట్టి విషయానికి అశోక్ రెడ్డిని నవ తెలంగాణ రిపోర్టర్ వివరణ కోరగా ఇలా చెప్పాడు. గ్రామంలో ఎవరినైనా అడగండి గ్రామపంచాయతీ సెక్రటరీ గ్రామ ప్రజలతో దురుసుగా మాట్లాడడం, గ్రామస్తులకు తక్కువ చేసి మాట్లాడడం గర్వంతో విర్రవీగిపోతున్నాడని గ్రామస్తులకు అడిగితే మీకు సరైన సమాధానం చెప్తారని అశోక్ రెడ్డి అన్నాడు. ముందు కార్యదర్శి నాపై దాడి చేశాడని, అశోక్ రెడ్డి తెలిపాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -