– జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవికుమార్
– ప్రభుత్వ కళాశాల ఆకస్మిక తనిఖీ
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ప్రతి విద్యార్థి ప్రతిరోజు కళాశాలకు వచ్చే విధంగా చూడాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవికుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇంటర్మీడియట్ విద్యాధికారి రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలోని అన్ని రకాల రిజిస్టర్ లను పరిశీలించారు. అడ్మిషన్లు, విద్యార్థిని విద్యార్థుల హాజరు శాతాన్ని, ఇప్పటివరకు పూర్తయిన సిలబస్ గురించి ఇంచార్జ్ ప్రిన్సిపాల్ మధు కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలోని తరగతి గదులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రతిరోజు కళాశాలకు వచ్చే విధంగా చూడాలని, విద్యార్థులకు 75 శాతం కంటే తక్కువ అటెండెన్స్ ఉంటే ఎగ్జామ్ ఫీజు కట్టేటప్పుడు ఇబ్బంది అవుతుందన్నారు.
విషయాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు.ప్రతి సబ్జెక్టుకు సంబంధించి స్పెషల్ క్లాసులు నిర్వహించి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా చూడాలని ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచాలన్నారు.అడ్మిషన్లు ఈ సంవత్సరం కమ్మర్ పల్లి జూనియర్ కళాశాలలో గణనీయంగా పెరిగాయని, ఇందుకు కృషి చేసిన అధ్యాపకులను అభినందించారు.కార్యక్రమంలో జిల్లా అధ్యాపక సంఘం అధ్యక్షుడు నరసయ్య, కళాశాల అధ్యాపకులు వెంకటేష్, రాజకుమార్, గంగాధర్, గంగారాం, మహేందర్, శ్రీహరి, మురళీకృష్ణ, వైష్ణవి, స్వాతి, సుమతి, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థి కళాశాలకు వచ్చే విధంగా చూడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES