Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దామరచర్లలో ఎమ్మెల్యే బీఎల్ఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

దామరచర్లలో ఎమ్మెల్యే బీఎల్ఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

- Advertisement -

నవతెలంగాణ – దామరచర్ల
రైతు సంక్షేమం కోసం రూ.2 కోట్ల విరాళంగా ఇచ్చిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చిత్రపటానికి దామరచర్లలో కాంగ్రెస్ మండల నాయకులు శుక్రవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తన కుమారుడి రిసెప్షన్ కోసం అయ్యే ఖర్చును రైతుల కోసం వినియోగించాలని ఆయన నిర్ణయించినట్లు చెప్పారు. తక్షణమే రూ.2 కోట్ల చెకు సీఎం రేవంత్ రెడ్డికి అందజేసినట్లు చెప్పారు. ఈ మొత్తాన్ని తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలని సీఎంకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయాన్ని సీఎం అభినందించారని చెప్పారు. ఎమ్మెల్యే నిర్ణయం పట్ల యావత్ రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుల తోపాటు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -