Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎనిమిదో రోజుకు చేరిన నిరవధిక సమ్మె

ఎనిమిదో రోజుకు చేరిన నిరవధిక సమ్మె

- Advertisement -

బిక్షాటన చేస్తూ నిరసన చేసిన హాస్టల్ వర్కర్లు
నవతెలంగాణ- అచ్చంపేట

తెలంగాణ రాష్ట్రంలో డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ జేఏసీ రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు గత ఏడు నెలల జీతాలు బకాయి వెంటనే చెల్లించాలని, పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని సమస్యలు పరిష్కరించాలని ఎనిమిది రోజులుగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో, గిరిజన వసతి గృహాలలో పనిచేస్తున్న డైలీ వైస్ వర్కర్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు. శుక్రవారం అచ్చంపేట పట్టణంలో షాప్ టూ షాప్ వెంట తిరుగుతూ భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి  శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. పర్మనెంట్ టైం స్కేల్ అమలు చేయాలని, చనిపోయిన వర్కర్ల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు వర్కర్స్ యూనియన్ జేసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్,  జిల్లా అధ్యక్షులు పర్వతాలు, రాములు, రాజు, అంజన్న, చిట్టి,  ఎల్లమ్మ, పద్మ, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -