Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపన్యాస పోటీలు

రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపన్యాస పోటీలు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
స్థానిక సెయింట్ జేవియర్స్ హై స్కూల్ లో రోటరీ క్లబ్ ఆప్ జేమ్స్ నిజాంబాద్ ఆధ్వర్యంలో ఈనెల 21న అంతర్జాతీయ శాంతి దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగిందని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ప్రెసిడెంట్ పాకాల నరసింహారావు తెలిపారు. ఈ పోటీలో విజేతలుగా 8, 9, 10 తరగతుల కేటగిరీలో జి.దీక్షిత అనే విద్యార్థినికి మొదటి బహుమతి గెలిచిందని 6,7 తరగతుల కేటగిరీలో టీ. దీక్షిత మొదటి బహుమతి గెలుపొందిందని క్లబ్ ప్రెసిడెంట్ పాకాల నరసింహారావు తెలియజేశారు. బహుమతి గెలుపొందిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గంజి రమేష్, పాస్ట్ ప్రెసిడెంట్ సూర్య ప్రకాష్, పాస్ట్ సెక్రెటరీ బంగారు వీరబ్రహ్మం, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -