Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ లబ్ధిదారుల వివరాలు నమోదు.!

ఇందిరమ్మ లబ్ధిదారుల వివరాలు నమోదు.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఎల్-1 జాబితా లబ్ధిదారుల వివరాలను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం యాప్లో అధికారులు నమోదు చేస్తున్నారు. మండల వ్యాప్తంగా 15 గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల ఎల్వన్ జాబితాలో 3,828 మంది ఉన్నారు.తాడిచర్లలో 1085, మల్లారంలో 273, పెద్దతూండ్ల 388, చిన్నతూండ్ల 171, అడ్వాలపల్లి 105, దుబ్బపేట 30, కొయ్యూరు 105, వల్లెకుంట 260, కొండపేట 91, ఇప్పలపల్లి 137, ఎడ్లపల్లి 184, రుద్రారం 575, మల్లెంపల్లి 45, అన్సాన్పల్లి 200, నాచారంలో 179 మంది ఎంపికయ్యారు.

రెం డు నెలలు పంచాయతీ కార్యదర్శులు జాబితా వివ రాలను సర్వే నిర్వహించి లబ్ధిదారుల ఫొటో క్యాప్చరింగ్తో ఆన్లైన్లో నమోదు చేశారు. కాగా ఈ నెల 2తో ప్రభుత్వం విధించిన గడవు ముగియడం తో సర్వే నిలిచి పోయింది. మళ్లీ ఈనెల 15 నుంచి యాప్ ఓపెన్ కావడంతో మూడు రోజులుగా క్షేత్ర స్థాయిలో కార్యదర్శులు ఫొటోలతో కూడిన లబ్ధిదారుల వివరాలను యాప్లో నమోదు చేస్తున్నా రు. ప్రతీ రోజు 30 వివరాలను నమోదు చేయాల్సి ఉండంగా యాప్లోని సాంకేతిక సమస్యల కారణం గా 10కి మంచి కావడం లేదని కార్యదర్శులు వాపో తున్నారు.ఇప్పటికే మండల వ్యాప్తంగా 300 లబ్దిదారుల వివరాలు మాత్రమే నమోదు చేశారు.సర్వర్ సమస్య తలెత్తడంతో ఈనెల 30 వరకు గడవు విధించినప్పటికీ పూర్తి స్థాయిలో నమోదు సాధ్యం కాకపోవచ్చని కార్యదర్శులు పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -