నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదినం సందర్బంగా సేవా పక్షంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మండల ప్రధానకార్యదర్శి తెరల శ్రీధర్ గుప్తా మాణిక్ భవన్ పాఠశాలలో నిర్వహించిన పుస్తకాల పంపిణి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చాయ్ అమ్ముకునే స్థాయి నుండి దేశప్రధానిగా ఎదిగి భారతదేశన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న మోడీని భావి తరాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ఆడబిడ్డ పుట్టిననాటి నుండి విద్య, వైద్యం, పెళ్లి చేసుకునేవరకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు.అందులో భాగంగా బేటీ బచావో బేటీ పడవో, సుకన్య సమృద్ధి యోజన, పోషణ మహా వంటి పథకాలను తీసుకురావడం జరిగిందన్నారు. అగ్రవర్ణ పేద విద్యార్థుల కోసం EWS రిజర్వేషన్ 10% తీసుకొచ్చి విద్య, ఉపాధిలో అవకాశాలు కల్పించడం చరిత్రత్మక నిర్ణయం అన్నారు. అగ్రవర్ణ పేద కుటుంబాలు అన్ని బిజెపి ప్రభుత్వానికి రుణపడి ఉన్నారని తెలిపారు.
మాణిక్ భవన్ పాఠశాలను రాష్ట్రంలో ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తాని అన్నారు. విద్యార్థులకు మౌలిక సౌకర్యాలతో పాటు అన్ని వసతుల ఏర్పాటుకు సహకరిస్తానని తెలిపారు. వినయం, విధేయత, విద్యకు మారుపేరుగా ప్రఖ్యాతలు కలిగిన మాణిక్ భవన్ పాఠశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తేవాలని విద్యార్థులకు సూచించారు.
అనంతరం 800 నోట్ పుస్తకాలు, పెన్నులను విద్యార్థులకు ఎమ్మెల్యే పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు ధన్ పాల్ శ్రీనివాస్ , మాణిక్ భవన్ పాఠశాల అధ్యక్షులు ఇంగు శివ ప్రసాద్, పట్టణ సంఘం ప్రధాన కార్యదర్శి ఇల్లందుల ప్రభాకర్, క్యాషియర్ గాలి నాగరాజు, ఆర్య వైశ్య సంఘ సభ్యులు మాణిక్ భవన్ పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు.