నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ (రిజిస్టర్డ్) ముఖ్యుల సమావేశం సెప్టెంబర్ 20వ తేదీ (శనివారం) నాడు ఉదయం 10:30 గంటలకు పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ భవన్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసు ఎదురుగా జిల్లా పరిషత్ దగ్గర సుభాష్ నగర్ వద్ద ఏర్పాటు చేయటం జరిగింది అని నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యఅతిథిగా ఎం శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం హాజరవుతున్నారు అని తెలియజేశారు.
నిజాంబాద్ నగరంలో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్, పార్కింగ్ సౌకర్యాలు, రోడ్ల నిర్మాణం, ఫుట్ పాత్ లు, డ్రైనేజ్, పార్కుల అభివృద్ధి, వివిధ సంస్థలు, వ్యాపార వర్గాలు చెల్లించాల్సిన టాక్స్ లు వసూలు, మాస్టర్ ప్లాన్ రూపొందించటం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, తదితర అంశాలపై ఒక ప్రణాళికను తయారుచేసి దానిని ఆమోదింప చేసుకుని భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసామన్నారు. సామాజిక, ప్రజాసేవలో నిమగ్నమై పనిచేస్తున్న మీరు, రిటైర్డ్ ఉద్యోగులు ఈ సమావేశం కు హాజరై విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.