నవతెలంగాణ – మిడ్జిల్
మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మహిళలకు గైనకాలజిస్ట్, స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. కావున మండలంలోని అన్ని గ్రామాల మహిళలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శివకాంత్ చెప్పారు. ఈ సందర్బంగా ఆయన శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలు రోగాలపై అవగాహన లేక ఎంతోమంది అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. స్వస్థ నారీ కార్యక్రమంలో భాగంగా మహిళలకు సంబంధించిన వ్యాధులపై స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తామని చెప్పారు. బి.పి షుగర్, టీబీ, ఇతర దీర్ఘ కాలిక వ్యాధులు వైరల్ ఫీవర్, ఇతర జ్వరాలు థైరాయిడ్ గుండె ,ఊపిరితిత్తులు , కిడ్నీ ,లివర్ సంబధిత దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.