తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల వేతన బకాయిలు వెంటనే ఇప్పించాలని నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు గారికి ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇచ్చారు. 19 సెప్టెంబర్ 2025 న డిపిఓ గారికి వినతి పత్రం ఇచ్చిన అనంతరం దాసు మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికుల వేతనాలు తక్కువే, చాకిరి ఎక్కువ వేతనం తక్కువ ఉన్నప్పటికీ గతి లేని పరిస్థితిలో పంచాయతీ కార్మికులు పరిసరాల పరిశుభ్రత స్వచ్ఛ తెలంగాణలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు.
గత మూడు నెలలుగా వేతన బకాయిలు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కుటుంబ అవసరాలు, మరో దిక్కు దసరా పండుగ వస్తుందని ఇప్పటికైనా వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, పంచాయతీ కార్మికులకు ప్రతి సంవత్సరం రెండు జతల డ్రస్సులు అన్ని పంచాయతీల్లో అమలు జరిగేటట్లు అధికారులు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.
గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతి సంవత్సరం గుర్తింపు కార్డులు ఇవ్వడంలో కొందరు కార్యదర్శులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అన్నారు. సఫాయి కార్మికులు నిజమైన దేవుళ్ళు అంటూ మెచ్చుకుంటూనే, కార్మికులపై పనిభారాన్ని,ఒత్తిడిని పెంచుతున్నారని, వారి వేతనాలు ఇతర సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం అశ్రద్ధ చేస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా వెంటనే వేతనాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి జేపీ గంగాధర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటుతుందని ఇప్పటికైనా సఫారీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు పెంచాలని ఆయన కోరారు. జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు శ్యామ్సన్, అబ్దుల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేపీ గంగాధర్, జిల్లా నాయకులు సొప్పరి గంగాధర్, నారాటి లక్ష్మణ్, పోశెట్టి, పల్నాటి సాయిలు, ప్రతినిధి బృందంగా వెళ్లి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. డిపిఓకు వినతి పత్రం సందర్భంగా జిల్లా నాయకులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.