బార్ అసోసియేషన్ అధ్యక్షులు సంజీవరెడ్డి
నవతెలంగాణ – దుబ్బాక
న్యాయవాదులపై దాడులు సరికావని, నాగర్ కర్నూల్ లో న్యాయవాదులులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని దుబ్బాక బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం. సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం దుబ్బాక లోని కోర్టు ఆవరణలో పలువురు న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో న్యాయవాదులపై దాడులు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో దుబ్బాక బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, సెక్రటరీ అశోక్, నాగరాజు, శ్రీరాం రామకృష్ణ ప్రభు, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్, కాస్తి శ్రీనివాస్, సంతోష్ కుమార్ పలువురు పాల్గొన్నారు.
న్యాయవాదులపై దాడులు సరికాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES