నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నాగపూర్ లో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో నిర్మాణం చేపట్టిన గ్రామపంచాయతీ భవన నిర్మాణం పనులు పిల్లర్లు, బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తయ్యాక నిలిచిపోయాయి. కొద్దిరోజుల కోసం తిరిగి కాంట్రాక్టర్ గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలోఎంపీడీవో పనులను పరిశీలించారు.
నూతన గ్రామపంచాయతీ నిర్మాణ పనులను తరితగతిన పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఉత్తమ మెటీరియల్ వాడి, నాణ్యతతో కూడిన పనులను చేయాలన్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ కు పలు సలహాలు సూచనలు చేశారు. రెండు సంవత్సరాలకు పైగా పంచాయతీ భవన నిర్మాణ పనులు నిలిచిపోవడానికి గల కారణాలను, ఇబ్బందులను కాంట్రాక్టర్ ను ఎంపీడీవో అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారి మహేందర్, పంచాయతీ కార్యదర్శి సంధ్య, తదితరులు పాల్గొన్నారు.
నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనుల పరిశీలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES