నవతెలంగాణ – వనపర్తి
చెన్నారం గ్రామం డబుల్ బెడ్రూమ్ కాలనీలో డ్రెయినేజీ సమస్యను పరిష్కారం చేయాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు సీపీఐ(ఎం) నాయకులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. భారత కమ్యునిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చెన్నారం గ్రామం డబుల్ బెడ్రూమ్ కాలనీలోని డ్రైనేజీ సమస్యను గుర్తించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.డీ జబ్బార్ మాట్లాడుతూ చెన్నారం గ్రామంలో డబల్ బెడ్ రూమ్ లు మంజూరు చేసి మూడు సంవత్సరాలు గడుస్తున్నా డ్రైనేజ్ సమస్య ఇప్పటి వరకు తీర్చలేదన్నారు. గ్రామంలో దాదాపు కిలోమీటర్ నుంచి ఈ కాలనీలోకి వర్షపు నీరు వస్తుందన్నారు.
గత ప్రభుత్వం ఈ కాలనీలో డ్రైనేజ్ వేశారని, కానీ నీరు బయటకు పోవడానికి చేయలేదన్నారు. దీనివలన కాలనీలో మురుగునీరు వర్షం నీరు నిలిచి చెరువును తలపిస్తున్నదని అన్నారు. కాలనీవాసులు వారి ఇండ్లలోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా రోడ్ల పైన నీళ్లు నిలిచాయని అన్నారు. నీళ్లు స్టోరేజ్ వలన విష పురుగులు, డెంగ్యూ జ్వరాలు, దుర్గంధం వాసన వచి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. వెంటనే డబుల్ బెడ్ రూమ్ కాలనీలోని స్టోరేజ్ వాటర్ బయటికి పంపడానికి భూ సేకరణ చేసి నీళ్ళు బయటికి పంపాలని వారు ఈఈ ని కోరారు. ఈ ఈ స్పందించి వెంటనే ఏఈని సర్వే కు పంపిస్తామని హామీ ఇచ్చారు. కచ్చితంగా ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు కే రాజశేఖర్ జి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
డ్రైనేజీ సమస్యను పరిష్కరించండి : సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES