అదనపు కలెక్టర్ రెవెన్యూ నాయక్ ఖీమ్య నాయక్
నవతెలంగాణ – వనపర్తి
జిల్లాలోని హార్వెస్టర్లు వారికి నిర్దేశించిన సమయానికే పంటల హార్వెస్టింగ్ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ నాయక్ ఖీమ్య నాయక్ ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ తన చాంబర్లో పంటలను హార్వెస్టింగ్ చేసే అంశంపై సంబంధిత అధికారులతో పాటు, పలువురు హార్వెస్టర్లతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని హార్వెస్టర్లు వారికి నిర్దేశించిన సమయానికే పంటలను హార్వెస్టింగ్ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలా కాదని హార్వెస్టర్లు పంటలు పచ్చిగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
పంట పచ్చిగా ఉన్నప్పుడు కోయడం వల్ల వరి కొనుగోళ్ల సమయంలో తేమ శాతం లో రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. కాబట్టి ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని హార్వెస్టింగ్ చేసేవారు తమకు అధికారులు కేటాయించిన సమయంలోనే పంటను కోయాలని ఆదేశించారు. రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయాలంటే అది ఎఫ్ ఏ క్యూ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, అందులో తేమశాతం కూడా కీలకమని చెప్పారు. నిర్దేశించిన సమయంలో హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఫ్యాన్ స్పీడ్ అధికారులు నిర్దేశించిన విధంగానే ఉండాలని ఆదేశించారు. ఇష్టానుసారంగా హార్వెస్ట్ చేసే వారిపై రవాణా శాఖ దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాథ్, పౌరసరఫరాల సంస్థ డిఎం జగన్ మోహన్, డిటిఓ మానస, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నిర్దేశిత సమయాలకే పంటల హార్వెస్టింగ్ ప్రారంభించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES