దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధి
నవతెలంగాణ – పాలకుర్తి
మండల కేంద్రంలో గల ప్రాథమిక పాఠశాలకు పాలకుర్తి గ్రామానికి చెందిన శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి అఖండ జ్యోతి వ్యవస్థాపకులు తాళ్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్యతో కలిసి శుక్రవారం 15 వేల విలువగల టీవీని బహుకరించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిదురాల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ దాతల సహకారంతో ప్రాథమిక పాఠశాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను అభివృద్ధి చేసి విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనను అందిస్తున్నామని తెలిపారు.
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పాలకుర్తి ప్రాథమిక పాఠశాలను అభివృద్ధి చేసేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. దాతల సహకారాన్ని విద్యార్థినీ, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విజయ్ కుమార్, ఎం.శ్రీనివాస్, ఎన్ శ్రీనివాస్, ఎస్ విజేందర్, మంజుల, శ్రీలత లతో పాటు సిఆర్పిలు కిషన్, సరేష్ తదితరులు పాల్గొని పాఠశాలకు టీవీని బహుకరించిన దాత చంద్రశేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
పాలకుర్తి ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES