Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన డీపీఓ 

బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన డీపీఓ 

- Advertisement -

నవతెలంగాణ – పాలకుర్తి
ఈనెల 21 నుండి 30 వరకు జరిగే బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం మండల కేంద్రంలో గల చెరువు సమీపంలో జనగామ డిపిఓ స్వరూప ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా స్వరూప మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచుల సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ వేడుకలు ప్రతిబింబమని తెలిపారు. చెరువులో నీరు లేకపోవడంతో మహిళలకు బతుకమ్మల వేడుకల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కల్పితకూడదనే సదుద్దేశంతో బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు చెరువు సమీపంలో ఉన్న బండల వద్ద పరిశుభ్రత ఏర్పాట్లను చేపట్టామని తెలిపారు. బండల వద్ద ఉన్న గుంతలో నీటి నిల్వను చేసేందుకు పరిశీలించామని తెలిపారు.  మహిళలకు బతుకమ్మల వేడుకల సందర్భంగా నిమజ్జనం కోసం నీరు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో బతుకమ్మలు ఆడుకునేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కపిలవాయి వెంకటేశ్వర చారి, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -