రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ
ఘనంగా ప్రజానాట్యమండలి వనపర్తి జిల్లా మహాసభ
నవతెలంగాణ – వనపర్తి
సాంస్కృత ఉద్యమంతో ప్రజానాట్యమండలి ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కృషి చేస్తుందని ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ తెలిపారు. వనపర్తి పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో గురువారం ప్రజానాట్యమండలి జిల్లా మహాసభను సీనియర్ కళాకారుడు నందిమల్ల రాములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ మాట్లాడుతూ జిల్లాలోని కళాకారులను ఐక్యపరచి సాంస్కృత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
జిల్లాలో జరిగే ప్రజా పోరాటాలకు ప్రజానాట్యమండలి తోడై ప్రజల హక్కుల పాటై ఆటై ముందుకు సాగుతుందన్నారు. కులం పేరుతో, మతం పేరుతో ప్రజలను విడదీసే రోజులు దాపురించాయన్నారు. ప్రజలను విడదీసే విధానాలకు వ్యతిరేకంగా ప్రజానాట్యమండలి కాలాన్ని గలాన్ని వినిపిస్తుందన్నారు. భవిష్యత్తులో వనపర్తి జిల్లా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా మహాసభను కళాకారుల ఆటపాటలతో ఉత్సాహంగా నిర్వహించారు.
అనంతరం ప్రజానాట్యమండలి వనపర్తి జిల్లా నూతన కమిటీ ఎన్నికయింది. జిల్లా కార్యదర్శిగా మల్లెమోని శివ, అధ్యక్షులుగా వెంకటేష్ ఎన్నికయ్యారు.మొత్తం 25 మందితో జిల్లా కమిటీ ఎన్నికయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి రాష్ట్ర నాయకులు కాకం అంజన్న, ఆశన్న, సీనియర్ నాయకులు నరేందర్ , రవిప్రసాద్ ,భగత్ మరియు జిల్లా నాయకులు ఎం శివ, వెంకటేష్, వెంకటస్వామి, కురుమయ్య, శివరాజు, ఎం నాగరాజు సాయినీల ,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.