నవతెలంగాణ – అశ్వారావుపేట
పోషకాహార లోపాలు,వాటిని సరి చేసే విధానాలు,సమతుల్య ఆహారం,ఎదుగుదల కి కావాల్సిన పోషకాహారం,శాకాహార ఆహారపు అలవాట్లు అనే అంశాలు పైనే సంపూర్ణ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జంబమ్మ అన్నారు. వ్యవసాయ కళాశాల దత్తత గ్రామం నారాయణపురం లో శుక్రవారం కళాశాల జాతీయ సేవ సంస్థ ఆధ్వర్యం లో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ వారి సహకారం తో నిర్వహించిన వర్క్ షాప్ లో “స్మార్ట్ టూల్స్ తో పోషకాహార జాగ్రత్తలు మరియు ఆరోగ్య పరిరక్షణ” అనే అంశం పై డాక్టర్ జంబమ్మ
అవగాహన కల్పించారు.శరీర బరువు,ఎత్తు,కండర ద్రవ్యరాశి,ఎముకల ద్రవ్యరాశి మొదలగు ముఖ్యమైన సూచికలు గురించి అవగాహనే కాకుండా వాటిని అక్కడున్న మహిళలు మరియు పిల్లలకి పరీక్షించి తగు జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమం వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్స్ డాక్టర్ నాగాంజలి, డాక్టర్ ఆర్. శ్రీనివాస్, డాక్టర్ కృష్ణ తేజ, డాక్టర్ ఝాన్సీ రాణి పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం గ్రామం లో ఆయిల్పామ్, వరి పంటల్లో యాజమాన్య పద్ధతుల గురించి స్థానిక రైతులతో చర్చించారు. ఈ కార్యక్రమాన్ని ఐసీడీఎస్ అశ్వారావుపేట సీడీపీఓ కే.ముత్తమ్మ,ఏసీడీపీఓ ఎమ్. అలేఖ్య, పర్యవేక్షకురాలు టి. రమ దేవి సమన్వయ పరిచారు.