Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వికలాంగుల వాయిస్ మాస పత్రిక..

వికలాంగుల వాయిస్ మాస పత్రిక..

- Advertisement -

11వ వార్షికోత్సవ సంచికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

వికలాంగుల వాయిస్ మాస పత్రిక 11వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను శుక్రవారం   జిల్లా కలెక్టర్ యం హన్మంతరావు, పత్రిక ఎడిటర్ యం అడివయ్య, ఎన్ పి ఆర్ డి  రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి స్వామి,జిల్లా అధ్యక్షులు ఎస్ ప్రకాష్, కార్యదర్శి ఉపేందర్, కోశాధికారి లలితలతో కలిసి, ఆవిష్కరించారు. ఈ సందర్బంగా  జిల్లా కలెక్టర్ హన్మంత రావు మాట్లాడుతూ వికలాంగులతో పాటు సకలాంగులలో చైతన్యం తీసుకురావడానికి వికలాంగుల వాయిస్ మాస పత్రిక చెస్తున్న కృషి అభినందననియమని అన్నారు. పత్రికల ద్వారా అనేక విషయాలు తెలుస్తాయని అన్నారు. పత్రికల ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. సమాజంలో వికలాంగులు అనేక రకాలుగా వివక్షతకు గురవుతున్నారని, వారిని చైతన్యం చేయడానికి వికలాంగుల వాయిస్ కృషి చేస్తుందని అన్నారు.

పత్రికలో జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు అనేక అంశాలపై వార్తలు వస్తున్నాయని అన్నారు. వికలాంగుల అంశాలే కాకుండా సమాజానికి అవసరమైన అనేక అంశాలు తీసుకురావడానికి ఎడిటోరియల్ బోర్డు కృషి చేస్తుందని అన్నారు.విద్యార్థులకు ఉపయోగ పడే అనేక అంశాలు పత్రికలో వస్తున్నాయని తెలిపారు. అంగవైకల్యం ఉందని వికలాంగులు కుంగి పోవద్దని, సమాజం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకుని ముందుకు వెళ్లాలని అన్నారు. అంగవైకల్యం శరీరానికే తప్ప ప్రతిభకు కాదని అనేక మంది వికలాంగులు నిరూపించారాని అన్నారు. హెలెన్ కెల్లర్, స్టీఫెన్ హాకింగ్, లూయిస్ బ్రెయిలి లను ఆదర్శనంగా తీసుకోవాలని అన్నారు.

పట్టుదల ఉంటే ఏదైనా సాధించే అవకాశం ఉందని అన్నారు.వికలాంగుల పట్ల వివక్షత చూపకుండా వారిని ప్రోత్సాహించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని తెలిపారు.11ఏండ్లుగా వికలాంగులే యాజమాన్యంగా వికలాంగుల వాయిస్ పత్రిక నడపడం వారీలో ఉన్న పట్టుదలకు నిదర్శనమని అన్నారు.వికలాంగుల సంక్షేమనికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ పథకాలు వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వికలాంగుల కోసం ఉన్న చట్టాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అన్నారు. వికలాంగుల పట్ల ఎవరైనా వివక్షత పాటిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -