నవతెలంగాణ – వనపర్తి
వనపర్తిలోని 220/ 132/ 33 కె.వి ఉపకేంద్రములో మరమ్మత్తులు (33KV బస్ బార్ క్లాంపులు, ఏ బి స్విచులు, జంపర్స్ మరమ్మత్తులు) చేపట్టడానికి విద్యుత్ సరఫరాను నిలిపివేయునున్నట్టు ట్రాన్స్కో అధికారులు నిర్ణయించారని టీజీఎస్పిడీసీఎల్ ఆపరేషన్ డివిజనల్ ఇంజనీర్ ఏ శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 220/ 132/ 33 కె.వి వనపర్తి ఉపకేంద్రము నుండి ఉన్నటువంటి 33 కెవి అన్ని ఫీడర్ల విద్యుత్తు సరఫరాను శనివారం నిలిపివేనున్నట్లుు తెలిపారు. అదే సమయంలో వనపర్తి పట్టణంలోని కర్నూల్ రోడ్డులో కొత్తగా 11KV లైన్ ఏ బి స్విచ్చులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కావున శనివారం ఉదయం 8:00 గంటల నుండి 10:30 వరకు వనపర్తి పట్టణం, వనపర్తి రూరల్ గ్రామాలు, పాన్గల్, గోపాల్పేట్, ఏదుల, రేవల్లి, పెద్దమందడి, ఘనపురం, కొత్తకోట మండలాలకు సంబంధించిన గ్రామాలలో విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందని తెలిపారు. కావున గృహ, వ్యాపార, పరిశ్రమలు, వ్యవసాయ వినియోగదారులు సహకరించాలని శ్రీనివాసులు కోరారు.
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES