Saturday, September 20, 2025
E-PAPER
Homeవరంగల్ప్రజల భద్రత కోసమే కార్డెన్ సర్చ్

ప్రజల భద్రత కోసమే కార్డెన్ సర్చ్

- Advertisement -

– కాటారం డిఎస్పి ఏ. సూర్యనారాయణ….
నవతెలంగాణ – కాటారం

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్‌సర్చ్‌ నిర్వహిస్తున్నామని కాటారం డిఎస్పి ఏ. సూర్యనారాయణ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే IPS గారి ఆదేశాల మేరకు శుక్రవారం తెల్లవారు జామున కాటారం మండలం కొత్తపల్లిలో డిఎస్పీ మరియు CI నాగార్జున రావు, ఆధ్వర్యంలో 65 మంది పోలీసు సిబ్బందితో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్ లేని 12 ద్విచక్ర వాహనాలు, ఇద్దరు వ్యక్తుల నుంచి 40 లీటర్ల గుడుంబా, 600 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా డీఎస్పీ గారు మాట్లాడుతూ… యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి రవాణా చేసిన, విక్రయించినా, సేవించినా చట్ట పరంగా యలు తీసుకుంటామని డిఎస్పీ గారు హెచ్చరించారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. భూ సంబంధిత గొడవల్లో పాల్గొని అమాయకులను మోసం చేస్తే కఠిన చర్యలుంటామమని తెలిపారు.
గ్రామాల్లో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కనపడితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. గంజాయి, గుడుంబా, ఇతర అక్రమ రవాణా వంటివి ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 ను సంప్రదించాలని, లేదా నేరుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని , సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. అలాగే ముఖ్యంగా ప్రజలు CC కెమెరాలు ఏర్పాటుకు ముందుకు రావాలని డిఎస్పీ గారు కోరారు. ఈ తనిఖీ కార్యక్రమంలో కాటారం సిఐ E. నాగార్జున రావు, ఎస్సైలు మహేందర్ కుమార్, శ్రీనివాస్, ఓం పాల్, మహేష్, మానస, 65 మంది సివిల్, TGSP పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -