Saturday, September 20, 2025
E-PAPER
Homeక్రైమ్రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

- Advertisement -


ఆటో డ్రైవర్, ప్రయాణికుడికి గాయాలు
పరారీలో లారీ, డ్రైవర్
మరో ప్రమాదంలో బీహార్ కార్మికుడికి గాయాలు
నవతెలంగాణ- నెక్కొండ

ద్విచక్ర వాహనం లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే యత్నంలో లారీ ఢీకొని న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాలైన సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పర్రావుపేట శివారులో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మంగళవారిపేట శివారు బోటిమీది తండాకు చెందిన గుగులోతు దాన్య (47), గూగులోతు ఈర్యాలు ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరు టీఎస్ 24సి0362 అను ద్విచక్రవాహనంపై నెక్కొండ మండలం బొల్లి కొండ గ్రామాoలో ఓ వ్యక్తి చనిపోగా అంత్యక్రియలకు హాజరై తిరిగి నెక్కొండ వైపుగా వస్తున్నారు. ఈ క్రమంలో అప్పలరావుపేట శివారులో చేరుకునే సమయానికి భారీ లారీ ద్విచక్రవాహన ముందు వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు అన్నదమ్ములు లారీనీ ఓవర్టేక్ క్రమంలో నెక్కొండ నుండి అలంకానిపేట వెళ్తున్న ఆటో ఎదురుగా రాగా ఆటోను తప్పించబోయే లారీ ఢీకొంది. ఈ ఘటనలో లారీ టైర్ కిందపడి దాన్య తల పగిలి చనిపోగా, ఈర్యా కాలు విరిగి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘటనలో ఎదురుగా వస్తున్న ఆటో డ్రైవర్, ఆటోలోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ మహేందర్ బాధితుడు ఈర్యను ఆటోలో ఆసుపత్రికి తరలించి మృతదేహాన్ని జీపులో పోస్ట్ మార్టం నిమిత్తం నర్సంపేటకు తరలించారు. సంఘటన స్థలాన్ని సిఐ శ్రీనివాస్ సందర్శించారు. మృతుడికి భార్య విజయ, కూతురు ఉన్నారు. లారీతోపాటు డ్రైవర్ పరారీ కాగా ఆటో డ్రైవర్ల నుంచి వివరాలు సేకరించి బాధితులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
మరో ఘటనలో బీహార్ కార్మికుడికి గాయాలు: నెక్కొండ లోని ఎస్టీ హాస్టల్ సమీపంలో జరిగిన ఘటనలో బీహార్ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. హాస్టల్ వైపు నుండి నడుచుకుంటూ వెళ్తున్న బీహార్ కార్మికుడు జాన్ ఇర్ఫాన్ ను ద్విచక్ర ఢీకొన్న క్రమంలో కార్మికుడి కాలు వీరి గాయపడ్డాడు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పరారీ కాగా స్థానికులు కార్మికుడిని ఆసుపత్రికి తరలించారు. కార్మికుడు ఇళ్లల్లో టైల్స్ పనులు చేస్తుంటారని స్థానికులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -