Saturday, September 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపేదలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య శస్త్ర చికిత్సలు

పేదలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య శస్త్ర చికిత్సలు

- Advertisement -

ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆడమ్‌
మహిళ శరీరం నుంచి 15 కిలోల కణితిని తొలగించిన వైద్యులు


నవతెలంగాణ-పటాన్‌చెరు
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌ శివారులోని మహేశ్వర మెడికల్‌ కళాశాల, ఆస్పత్రిలో శుక్రవారం వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌ మున్సిపాలిటీకి చెందిన ముంతాజ్‌(55).. మూడేండ్లుగా కడుపునొప్పి, పొట్ట పెరగటం వంటి సమస్యలతో బాధపడుతున్నది. కుటుంబ సభ్యులు చాలా ఆస్పత్రుల్లో చూపించినప్పటికీ సరైన చికిత్స లభించలేదు. ముగ్గురు పిల్లల తల్లి అయిన ముంతాజ్‌కు థైరాయిడ్‌, బీపీ వంటి సమస్యలు కూడా ఉన్నాయి. కాగా, ఎడమ అండాశయంలో 15 కిలోల కణితి పెరిగి సమస్య తీవ్రమైనదిగా వైద్యులు గుర్తించారు. 12 సంవత్సరాలుగా జిల్లా ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని పేదలకు అందుబాటులో ఉండేలా అతి తక్కువ ఖర్చుతో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్న మహేశ్వర మెడికల్‌ కళాశాల యాజమాన్యం ముంతాజ్‌ విషయంలో తమ వంతు సామాజిక బాధ్యతగా అతి తక్కువ ఖర్చులోనే వైద్యాన్ని అందించడానికి ముందుకు వచ్చింది.

ముంతాజ్‌ వయసు, ఆరోగ్యం దృష్ట్యా శస్త్రచికిత్స ప్రమాదకరం అయినప్పటికీ రిస్క్‌ తీసుకుని లాపరోటమీ ద్వారా తన అండాశయంలో పెరిగిన 15 కిలోల కణితిని తొలగించి గర్భసంచి ఆపరేషన్‌ చేసినట్టు ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆడమ్‌ తెలిపారు. పేదలకు అతి తక్కువ ఖర్చుతో శస్త్రచికిత్సలు అందించడం తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఈ శస్త్ర చికిత్సలో డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ హేమంత్‌, డాక్టర్‌ భావనా రెడ్డి, అంకాలజీ విభాగం డాక్టర్‌ శంకర్‌ రెడ్డి, సర్జరీ విభాగం డాక్టర్‌ సూర్యతేజ, స్త్రీల వైద్య విభాగం డాక్టర్‌ అరుణ, డాక్టర్‌ అపర్ణ, డాక్టర్‌ సుప్రియ, డాక్టర్‌ శివలత, డాక్టర్‌ ఆకాంక్ష తదితర నిపుణులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -