నవ తెలంగాణ – హైదరాబాద్
ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో అసెట్స్ ఫెయిర్ 2025 20, 21 తేదీలలో(శని,ఆదివారాలు) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్‌లోని సోమజిగూడ, జయా గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు.ఈ ఫెయిర్‌ను ఇండియన్ బ్యాంక్ హైదరాబాద్ జోనల్ మేనేజర్ శ్రీ కె. శ్రీనివాస్, మల్కాజిగిరి జోనల్ మేనేజర్ స్వర్ణ ప్రభా సుందరరారులు శనివారం ప్రారంభిస్తారని ఆ బ్యాంక్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ భారీ ఫెయిర్‌లో హైదరాబాద్, అమరావతి, విజయవాడ, మల్కాజిగిరి, కరీంనగర్, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి జోన్లు పాల్గొంటున్నాయి. 120కి పైగా నివాస, వాణిజ్య ఆస్తులను ప్రదర్శనకు ఉంచి అమ్మకానికి అందుబాటులో ఉంచనున్నారు. వీటిలో అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత గృహాలు, ఓపెన్ ప్లాట్లు, కమర్షియల్ స్పేస్‌లు ఉన్నాయి. కొనుగోలుదారులకు విస్తృత ఎంపిక లభించనుంది. ఇండియన్ బ్యాంక్ దేశవ్యా ప్తంగా ఇలాంటి ఫెయిర్‌లను వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌లో జరగనున్న అసెట్స్ ఫెయిర్ 2025కు రియల్ ఎస్టేట్ పెట్టుబడి దారులు, వ్యాపార వర్గాలు, వ్యక్తిగత కొనుగో లుదారులు విస్తృతంగా పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు.
నేటి నుంచి ఇండియన్ బ్యాంక్ అసెట్స్ ఫెయిర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES