Saturday, September 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమిల్లెట్లలోనే ఆరోగ్యం, భవిష్యత్తు

మిల్లెట్లలోనే ఆరోగ్యం, భవిష్యత్తు

- Advertisement -

– సహజ సిద్ధమైన ఆహారంతో అనారోగ్యం దరిచేరదు : లయోలా అకాడమీ మిల్లెట్‌ ఫెస్టివల్‌లో మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మిల్లెట్లతో ఆరోగ్యం, భవిష్యత్తు సాధ్యమనీ, సహజ సిద్ధమైన ఆహారంతో అనారోగ్యం దరిచేరదని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ(సీతక్క) చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అల్వాల్‌లో గల లయోలా అకాడమీలో మిల్లెట్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌లు, విద్యార్థులు పాల్గొన్నారు. స్టాళ్లను మంత్రి సందర్శించారు. పిల్లలు తయారు చేసిన మిల్లెట్‌ వంటకాలను రుచిచూశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మిల్లెట్లు అధిక పోషక విలువలతో ఆకలి తీర్చడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడు తాయని చెప్పారు.

ఒకప్పుడు అనాగరిక, ఆటవిక ఆహారంగా పరిగణించిన మిల్లెట్లు నేడు స్టార్‌ హౌటల్స్‌లో లభించడం గర్వకారణమని తెలిపారు. ఈ తరం మిల్లెట్‌ ఆహారాన్ని తప్పనిస రిగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తాను మిల్లెట్‌ ఆహారం తీసుకోవడం వల్లనే ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. ఆదివాసీ సమాజం సహజ సిద్ధమైన ఆహారం, స్వంత జ్ఞానంతోనే బతుకుతుందన్నారు. తాను ఎప్పుడూ శారీరక శ్రమకు వెనకాడనందువల్లే కరోనా సమయంలో వందరోజులు సేవలు చేసినా ఏ అనారోగ్య సమస్య రాలేదని ఆమె గుర్తు చేశారు. అమ్మాయిలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించి, కష్టపడి చదువుకొని తల్లిదండ్రులు గర్వించేలా ఎదగాలని సూచించారు. విద్య ద్వారానే గౌరవం లభిస్తుందన్నారు. వివక్ష లేకుండా అన్ని రంగాల్లో అమ్మాయిలను ప్రోత్సహిం చాలన్నారు. విద్యాసంస్థలు, విద్యార్థులు ఆదివాసీ గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకమై సమాజాన్ని అధ్యయనం చేయాలని సీతక్క సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -