– తుమ్మడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి రూ. 35 వేల కోట్లు అవాస్తవం : మంత్రి ఉత్తమ్ కౌంటర్
– అంచనాల ప్రక్రియే చేపట్టలేదు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి రూ.35 వేల కోట్లు, సాగులోకి 4.47 లక్షల ఆయకట్టు అంటూ బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తుమ్ముడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించాలనీ, చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం పనులను పునరుద్దరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఈ మేరకు శుక్రవారం డా.బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి మీడియాకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. హరీశ్‌రావు ప్రకటనలు పూర్తిగా నిరాధారమైనవనీ, ఆయన మాటలు సత్యదూరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన అంచనాల ప్రక్రియనే మొదలు పెట్టలేదనీ, అలాంటప్పుడు హరీశ్‌రావు ఇవీ అంచనాలు అంటూ ఎలా నిర్దారణకు వచ్చారని ప్రశ్నించారు. అన్నింటికీ అతితెలివితేటలు వినియోగించకూడదన్నారు. ఇలాంటి అతితెలివి తేటలతో ప్రజా క్షేత్రంలో అభాసు పాలవుతారని చెప్పారు. ఇటువంటి ప్రకటనల పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తుమ్మడిహట్టి బ్యారేజీ చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకు సంబంధించిన అంచనాలను రూపొందించిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుందని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తున్నదన్నారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందనీ, అందుకే పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
హరీశ్‌రావు ప్రకటన అబద్దం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES