– ఎనుమాములలో హమాలీ కార్మికుడు,
– సూర్యాపేట జిల్లా ఉపాధి హామీ పనుల్లో మహిళ మృతి
నవతెలంగాణ-కాశిబుగ్గ
రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగుతున్న ఇద్దరు వడదెబ్బకు గురై మృతిచెందిన ఘటనలు వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో గురువారం జరిగాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం సాగర్ గ్రామానికి చెందిన శివరాత్రి శ్రీను (41) గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ పరిధిలోని సుందరయ్య నగర్‌లో ఉంటూ ఎనుమా ముల మార్కెట్‌లో హమాలీ కార్మికునిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు. గురువారం ఎప్పటిలాగే యధావిధిగా మార్కెట్‌కు వచ్చి విధు లు నిర్వహించే క్రమంలో మధ్యాహ్నం సుమారు మూడు గంటలకు వడదెబ్బ తగిలి స్పృహ కోల్పోయాడు. తోటి కార్మికులు వెంటనే శ్రీనును ఆటోలో ఎంజీఎం హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని హమాలీ కార్మికులు, సుందరయ్య నగర్ కాలనీవాసులు కోరారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ పరిధిలోని మిడతనపల్లి గ్రామానికి చెందిన పాశం జానమ్మ (80) ఏప్రిల్ చివరివరంలో ఉపాధి హామీ పనికి పోతే వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆమె గురువారం మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు.
వడదెబ్బతో ఇద్దరు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES