Saturday, September 20, 2025
E-PAPER
Homeకరీంనగర్పోలీసు, అటవీశాఖ అధికారులను నిర్బంధించిన గ్రామస్తులు

పోలీసు, అటవీశాఖ అధికారులను నిర్బంధించిన గ్రామస్తులు

- Advertisement -

నవతెలంగాణ – రుద్రంగి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని మానాల గ్రామస్తులు అటవీశాఖ అధికారులను, పోలీస్ సిబ్బందిని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం  నిర్బంధించారు. గతంలో అటవీశాఖ అధికారులు నాటిన నీలగిరి చెట్లను శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేయడంతో గ్రామస్తులంతా గ్రామపంచాయతీ వద్ద ఆందోళనకు దిగడంతో విచారణ నిమిత్తం అక్కడికి చేరుకున్న పోలీసు మరియు అటవీశాఖ సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకొని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ… అటవీ ప్రాంతమైన ఉమ్మడి మానాల గ్రామ చుట్టుపక్కల అడవులను కొందరు స్వలాభం కోసం నరికి వేస్తున్న అటు అటవీశాఖ అధికారులు ఇటు పోలీసులు చోద్యం చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -