Saturday, September 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమహిళా సంఘాలకు గుడ్ న్యూస్..

మహిళా సంఘాలకు గుడ్ న్యూస్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేసే విధంగా తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, సీతక్క, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. గ్రేటర్‌పరిధిలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. ‘‘మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. మహిళలను ఇప్పటికే 150 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశాం. మరో 450 బస్సులకు యజమానులను చేయబోతున్నాం. !
మంత్రి సీతక్క మాట్లాడూతూ..‘
‘గతంలో డబ్బుల కోసం మగవారిపై ఆధారపడే పరిస్థితి ఉండేది. మహిళలు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకువచ్చింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. మహిళలకు కుట్టుమిషన్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లు ఏర్పాటు చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ మహిళా సంఘాలకు అప్పగించాం. సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారు. ఉచిత బస్సు సౌకర్యం అందిస్తుంటే.. భారత రాష్ట్ర సమితి ఈ పథకాన్ని అగౌరవపరుస్తూ మహిళలపై విమర్శలు చేస్తోంది’’ అని మంత్రి సీతక్క అన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తం: పొన్నం
ఐదు సంవత్సరాలలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందిరా గాంధీ అడుగుల్లో నడుస్తూ మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం.  అర్హులు అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. మహిళలందరికీ ఉంచితంగా బస్సు సౌకర్యం కల్పించాం.  200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. మహిళలను ఉన్నతమైన స్థానంలో ఉంచేందుకు ప్రభుత్వం పనులు చేస్తుంది. మహిళల ఆశీర్వాదాలు మా ప్రభుత్వానికి ఉండాలి.
మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడూతూ ..
మహిళలను ఆర్థికంగా నిలదొక్కకునేలా చేయడానికే ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా 50 వేల మహిళా సంఘాలకు మహిళా సంఘాలకు ఇస్తున్నామని చెప్పారు. మహిళలకు పెట్రోల్ బంకులు ఇస్తున్నామన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు రావడం ఆనందంగా ఉందన్నారు వివేక్. మేయర్ గద్వాల విజయలక్ష్మి అద్భుతంగా పని చేస్తుందన్నారు. ఇది ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజల కోసమే పని చేస్తుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -